Tuesday, June 16, 2026
Homeసినిమా'భాగ్ సాలే' .. రిలీజ్ డేట్ ఖరారు!

‘భాగ్ సాలే’ .. రిలీజ్ డేట్ ఖరారు!

యువ హీరోల్లో ఎవరికి వారు కొత్త కాన్సెప్ట్ లకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ రేసులో స్పీడ్ పెంచడానికి శ్రీసింహా ట్రై చేస్తున్నాడు. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఒక్కో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. శ్రీసింహా హీరోగా ఇంతకుముందు ‘తెల్లవారితే గురువారం’ .. ‘దొంగలున్నారు జాగ్రత్త’ వంటి సినిమాలు చేశాడు.ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ‘భాగ్ సాలే’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.

ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచిన ఈ సినిమా జూలై 7న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుంది. నేహా సోలంకీ, రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాకు సంగీతం కాల భైరవ అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకొంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular