Saturday, November 23, 2024
HomeTrending Newsశక్తికాంత్ దాస్ పదవీకాలం పొడిగింపు

శక్తికాంత్ దాస్ పదవీకాలం పొడిగింపు

Another 3 Years Of Term Extension For Rbi Governor :

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్  పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10, 2021తో అయన ప్రస్తుత పదవీ కాలం ముగియనుంది. అయితే ఆయన్ను మరో మూడేళ్ళపాటు aa పదవిలో కొనసాగించాలని కేంద్ర కేబినేట్ తీర్మానించింది.

ఒడిశాకు చెందిన శక్తికాంత్ దాస్ 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. ఇండియన్ సివిల్ సర్వీసు అధికారిగా తమిళనాడు తో పాటు కేంద్రంలో పలు కీలక శాఖల్లో అయన పనిచేశారు. కేంద్ర ఆర్ధిక వ్యవహారాలు, రెవిన్యూ, ఫెర్టిలైజెర్స్ శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు. 2016 నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసిన సమయంలో ఆర్ధిక శాఖలో కీలకంగా పనిచేశారు. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తగిన సమాచారాన్ని అందిస్తూ సామాన్య ప్రజలతో పాటు, కీలకమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాలకు ప్రభుత్వం తరఫున తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవారు. డిసెంబర్ 12, 2018న కేంద్ర ప్రభుత్వం ఆయనను కీలకమైన రిజర్వ్ బ్యాంకు గవర్నర్ పదవికి ఎంపిక చేసింది.

నోట్ల రద్దుతో పాటు రెండేళ్లుగా కోవిడ్ మహామ్మారితో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలైన పరిస్థితుల్లో శక్తికాంత్ దాస్ సేవలను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ అపాయింట్స్ కమిటీ శక్తికాంత్ దాస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 2024 వరకూ అయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

Must read :బడ్జెట్ కు ఏపి కేబినేట్ ఆమోదం

RELATED ARTICLES

Most Popular

న్యూస్