Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్సన్ రైజర్స్ బేజారు: పంజాబ్ విజయం

సన్ రైజర్స్ బేజారు: పంజాబ్ విజయం

ఐపీఎల్ తాజా సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో చెత్త ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. బౌలింగ్ లో రాణించినా, బ్యాటింగ్ వైఫల్యంతో మ్యాచ్ ను చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్ తో షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పంజాబ్ చేసిన 125 పరుగుల చిన్నపాటి లక్ష్యాన్ని కూడా చేరుకోలేక చతికిలపడింది. చివర్లో హోల్డర్ సిక్సర్ల మోత మోగించి విజయంపై ఆశలు రేకెత్తించినా ఆఖరి ఓవర్లో 17 పరుగులు కావాల్సి ఉండడంతో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు.

టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది. కెప్టెన్ రాహుల్ 21  పరుగులు చేశాడు. ఏడెన్ మార్ క్రమ్ 27, హర్ ప్రీత్ బార్-18 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 3  వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, భువీ, రషీద్, అబ్దుల్ సమద్ తలా ఒక వికెట్ సాధించారు.

హైదరాబాద్ లో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా మినహా మిగిలిన టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. కీలక ఆటగాళ్ళు డేవిడ్ వార్నర్, కెప్టెన్ విలియమ్సన్ మరోసారి విఫలమయ్యారు. జాసన్ హోల్డర్ 29 బంతుల్లో 5 సిక్సర్లతో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్-3; షమి-2; అర్ష్ దీప్ సింగ్-1 వికెట్ పడగొట్టారు.

బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన సన్ రైజర్స్ ఆటగాడు హోల్డర్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్