Sunday, September 8, 2024
HomeTrending Newsసిరియాలో మళ్ళీ భూకంపం...రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదు

సిరియాలో మళ్ళీ భూకంపం…రిక్టర్ స్కేల్ పై 5.4గా నమోదు

పదిరోజుల క్రితం ప్రకృతి సృష్టించిన తీవ్ర నష్టం నుంచి ఇంకా కోలుకోని సిరియాలో మరోసారి భూకంపం వచ్చింది. గురువారం రాత్రి 10.47 గంటలకు ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై  5.4గా నమోదయిందని సిరియా జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. దీనిప్రభావంతో రాజధాని డమాస్కస్, ఉత్తర ప్రావిన్స్ అలెప్పోలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. భూ అంతర్భాగం 18.8 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నది.

30 నిమిషాల వ్యవధిలోనే వాయువ్య తీర ప్రావిన్స్ అయిన లటాకియాలో కూడా భూమి కంపించిందని వెల్లడించింది. రాత్రి 11:17 గంటలకు 3.4 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపింది. లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, 46 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని చెప్పింది.
ఈనెల 6న టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 41 వేల 732 మంది మరణించారు. ఇందులో టర్కీలోనే 38,044 మంది ఉండగా, సిరియాలో 3688 మంది ఉన్నారు. అయితే సిరియా ప్రధాన భూభాగంలో 1414 మంది మంది మృత్యువాత పడ్డారు.

Also Read:   2.3 కోట్ల మందిపై తుర్కియే భూకంపం ప్రభావం

RELATED ARTICLES

Most Popular

న్యూస్