Saturday, January 18, 2025
HomeసినిమాMahesh-Trivikram: 'గుంటూరు కారం'కు ఏమైంది?

Mahesh-Trivikram: ‘గుంటూరు కారం’కు ఏమైంది?

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఏ మూహూర్తాన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందో కానీ.. అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్  కాగానే తీసిన  ఫైట్ సీక్వెన్స్ మహేష్ బాబుకు నచ్చకపోవడంతో ఫైట్ మాస్టర్స్ నే మార్చేశారు. ఆతర్వాత కథనే మార్చేశారు. యాక్షన్ మూవీ కాస్తా మాస్ అయ్యింది,.

ఆ తర్వాత త్రివిక్రమ్ ఓ షాపింగ్ మాల్ లో ఓ ఎపిసోడ్ చిత్రీకరించారు. అది త్రివిక్రమ్ కే నచ్చలేదట. దాన్ని పక్కనపెట్టారు. ఆతర్వాత మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై మహేష్‌ అసంతృప్తిగా ఉన్నాడని, అతన్ని మార్చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆగష్టు 11న విడుదల చేస్తామని ప్రకటించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి వాయిదా వేశారు. ఈ సినిమాలో పూజా హేగ్డే, శ్రీలీల నటించాల్సి ఉండగా,  ఏమైందో తెలియదు కానీ పూజా హేగ్డే తప్పుకుంది. ఆమె ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చింది.

ఇప్పుడు మరో బిగ్ ఛేంజ్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ పి ఎస్ వినోద్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారికంగా అప్ డేట్ రావాల్సి ఉంది. షూటింగ్ ఎంతకి ముందుకు వెళ్లడం లేదట. అందుకనే కొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి డేట్స్ ఇచ్చి..  టైమ్ వేస్టు చేసుకోవడం కన్నా ఈ మూవీ నుంచి తప్పుకోవడమే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారట.  మరి.. సినిమా కంప్లీట్ అయ్యే లోపు ఇంకెన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్