నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇందులో నాగచైతన్యకు జంటగా సాయిపల్లవి నటించింది. కులాల అంతరం ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమని తనదైన స్టైల్ లో తెరకెక్కించారు శేఖర్ కమ్ముల. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన లవ్ స్టోరీ అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య ‘బంగార్రాజు’, ‘థ్యాంక్యూ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

బంగార్రాజు సినిమాతో సక్సెస్ సాధించిన నాగచైతన్య.. థ్యాంక్యూ మూవీతో మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం ‘కస్టడీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగచైతన్యకు జంటగా కృతి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాతో నాగచైతన్య తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నారు. చైతన్య కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీ భారీ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. ఇందులో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుంటే.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. తండ్రీకొడుకులు ఇళయారాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం మరో విశేషం.

అయితే.. కస్టడీ తర్వాత నాగచైతన్య ఎవరితో సినిమా చేయనున్నారు అనేది ప్రకటించలేదు. తాజాగా శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.శేఖర్ కమ్ముల ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ధనుష్ సార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే కెప్టెన్ మిల్లర్ అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ దశలో ఉంది. అది కంప్లీట్ అయ్యాక శేఖర్ కమ్ముల సినిమాని సెట్స్ పైకి వస్తుంది. ఇక ధనుష్ మూవీని కంప్లీట్ చేసాక శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి టైమ్ పడుతుంది. మరి.. ఈసారి నాగచైతన్యతో శేఖర్ కమ్ముల ఎలాంటి సినిమాను రూపొందిస్తారో..? ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *