Friday, June 12, 2026
Homeసినిమావిజయ్, పరశురామ్ కాంబో ఫిక్స్

విజయ్, పరశురామ్ కాంబో ఫిక్స్

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో ‘గీత గోవిందం’ అనే సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఈ మూవీ చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించింది. దీంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. విజయ్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ఒక పరశురామ్ గీత గోవిందం తర్వాత నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై మూవీని ప్రకటించారు. నాగేశ్వరరావు అనే టైటిల్ అనుకున్నారు.

అయితే.. అనుకోకుండా సూపర్ స్టార్ మహేష్‌ బాబుతో సినిమా చేసే అవకాశం రావడతో చైతన్య ప్రాజెక్ట్ పక్కనపెట్టి మహేష్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా తీశాడు. ఇది సక్సెస్ అయ్యింది కానీ.. బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. ఈ మూవీ తర్వాత నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు పరశురామ్. అయితే.. చైతన్య కస్టడీ మూవీలో బిజీ అయ్యాడు. పరశురామ్ చెప్పిన స్టోరీలో మార్పులు చేర్పులు చెప్పాడు. అయితే.. పరశురామ్ చేసిన మార్పులు చేర్పులు నాగచైతన్యకు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.

సర్కారు వారి పాట కంప్లీట్ అయిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు ఖాళీగా ఉన్న పరశురామ్ ఇప్పుడు మళ్లీ విజయ్ తో సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొంండ, పరశురామ్.. గీత గోవిందం కాంబినేషన్ అయిన ఈ కాంబోలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.  ఈ మేరకు ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ తాజా ప్రకటనతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. విజయ్ తో పరశురామ్ గీత గోవిందం సీక్వెల్ తీస్తాడో..? లేక మరో కథతో మూవీ చేస్తాడో..? తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular