Wednesday, June 17, 2026
HomeసినిమాBalakrishna Web Series: బాలయ్యతో భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఓటీటీ సంస్థ

Balakrishna Web Series: బాలయ్యతో భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఓటీటీ సంస్థ

బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఓటీటీలో కూడా రాణిస్తున్నారు. ఆహా కోసం అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేశారు. ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో బాలయ్యకు మరింత క్రేజ్ పెరిగింది. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలయ్య.. ఇటీవల వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నారు. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుండడం విశేషం.

అయితే.. బాలయ్యతో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి బాలయ్య వెబ్ సిరీస్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. కాకపోతే.. ఈసారి బాలయ్యతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుంది ఆహా కోసం అల్లు అరవింద్ కాదట. మరో భారీ ఓటీటీ సంస్థ బాలయ్యతో వెబ్ సిరీస్ చేసేందుకు ప్లాన్ చేస్తుందట. ఈ వెబ్ సిరీస్ భారీ హంగులతో.. భారీ బడ్జెట్ తో సరికొత్త కథాంశంతో ఉంటుందట. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారని సమాచారం.

ఇలా బాలయ్య ట్రెండ్ కు తగ్గట్టుగా ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన బ్రాండ్ ను మరింతగా పెంచుకున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో  వంద సినిమాలు పూర్తి చేశారు. కెరీర్ లో వంద అనే మైలురాయిని చేరుకున్న తర్వాత స్పీడు తగ్గుతుంది అనుకుంటే.. అంతకు మించి అన్నట్టుగా స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న బాలయ్య కోసం నలుగురు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. మరి.. బాలయ్య వెబ్ సిరీస్ తో కూడా ఆకట్టుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో.

Also Read : బాలయ్య బాబుతో పెద్ద సినిమా చేస్తాను: విశ్వక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular