Thursday, June 18, 2026
HomeసినిమాNani: నాని సంచలన వ్యాఖ్యలు

Nani: నాని సంచలన వ్యాఖ్యలు

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. అనుకోకుండా హీరో అయి.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మన పక్కంటి కుర్రాడు అనేంతగా పేరు తెచ్చుకున్న నాని ఇప్పుడు దసరా అంటూ పాన్ ఇండియా మూవీ చేశాడు. ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్ నటించింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడంతో దసరా మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 30న దసరా మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల కానుంది.

అయితే.. దసరా ప్రమోషన్స్ లో దేశం మొత్తం చుట్టేస్తున్న నాని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇంతకీ ఏం నాని ఏమన్నాడంటే..
సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని.. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో చాలా కష్టంగా ఉండేదని… ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది అర్థమయ్యేది కాదని అన్నారు. ఎన్నో సవాళ్లను, తిరస్కరణలను ఎదుర్కొన్నానని చెప్పారు. అయితే.. వేరే వాళ్లతో పోలిస్తే తాను తక్కువ కష్టాలనే ఎదుర్కొన్నానని చెప్పారు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ కి ఏదైనా చెప్పేయొచ్చని అందరూ అనుకుంటుంటారని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారని… వారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా… ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పారు. క్లాప్ బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అంటారని అన్నారు. అయితే.. తను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఓ డైరెక్టర్ అవమానించాడని.. ఎప్పటికీ డైరెక్టర్ కాలేవని అన్నాడని.. ఆ మాటతో ఎంతో బాధపడ్డానని చెప్పారు. దీంతో నానిని బాధపెట్టిన ఆ దర్శకుడు ఎవరు అనేది ఆసక్తిగా మారింది. నాని చెప్పిన ఈ సమ్ గతులు వైరల్ అయ్యాయి.

Also Read : నాని నెల రోజుల ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular