Saturday, June 27, 2026
Homeసినిమాఏప్రిల్ 20న 'అంటే సుందరానికి' టీజర్

ఏప్రిల్ 20న ‘అంటే సుందరానికి’ టీజర్

Sundaram: నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రం స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా సందడి చేస్తోంది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని మొదటి పాట పంచెకట్టు సూపర్‌హిట్ కాగా, పోస్టర్లు, హోమం వీడియో స్పెషల్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఇప్పుడు చిత్ర యూనిట్ టీజర్ రిలీజ్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో పాటు మరో రెండు బ్రాండ్ న్యూ పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ పోస్టర్స్ లో హీరో, హీరోయిన్ హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా వుంది. ఇందులో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి నటిస్తుండగా, లీలా థామస్ పాత్రలో నజ్రియా కనిపించనున్నసంగతి తెలిసిందే.

వెస్ట్రన్ అవుట్ ఫిట్ లో క్లాస్‌ అండ్ స్టైలిష్‌గా,మరో పోస్టర్ లో సంప్రదాయ దుస్తులలో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Also Read :‘అంటే సుందరానికి’ నుంచి ‘పంచెకట్టు’ పాట విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular