Sunday, January 19, 2025
HomeTrending Newsచైనా ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ డ్యూటీ

చైనా ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ డ్యూటీ

చైనా నుంచి భారత్ కు దిగుమతి చేసుకునే 35 ఉత్పాదనలపై అయిదేళ్ళపాటు యాంటీ డంపింగ్ డ్యూటీని విధించినట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వకంగా జవాబిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఇటీవల చైనా నుంచి దిగుమతి చేసుకునే ఫ్లాట్ రోల్డ్ అల్యూమినియం ఉత్పాదనలు, సోడియం హైడ్రోసల్ఫైట్, సిలికాన్ సీలెంట్, హైడ్రోఫ్లూరోకార్బన్ కాంపోనెంట్ అయిన ఆర్ 32, హైడ్రోఫ్లూరోకార్బన్ బ్లెండ్స్‌పై ప్రభుత్వం యూంటీ డంపింగ్‌ డ్యూటీ విధించినట్లు చెప్పారు. ఈ అయిదు చైనా ఉత్పాదనలు కాకుండా గతంలో చైనా నుంచి దిగుమతి అయ్యే 30 వస్తువులపై కూడా యూంటీ డంపింగ్‌ డ్యూటీ విధించినట్లు తెలిపారు.

చెక్కెర ఎగుమతులపై డబ్ల్యూటీవోలో ఫిర్యాదు
భారత్‌ నుంచి జరిగే చెక్కెర ఎగుమతులపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, గౌటెమాలా దేశాలు ఫిర్యాదు చేశాయని వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ శుక్రవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఈ ఫిర్యాదుపై డబ్ల్యూటీవో వివాద పరిష్కార ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప్యానల్‌ గత ఏడాది డిసెంబర్‌లో తన నివేదికను సమర్పిస్తూ డబ్ల్యూటీవో వ్యవసాయ ఒప్పందంలో పేర్కొన్న పరిమితులను అతిక్రమిస్తూ భారత్‌ చెరకు రైతులకు మద్దతు ఇస్తోందని పేర్కొంది. అలాగే కొన్ని పథకాల పేరుతో చెక్కెర ఎగుమతిదార్లకు సబ్సిడీలు అందిస్తోంది. చెక్కెర ఎగుమతిదార్లకు సబ్సిడీలు ఇవ్వడం నిషేధం అని ప్యానల్‌ తన నివేదికలో పేర్కొంది. ప్యానల్‌ నివేదికను డబ్యూటీవోలో భారత్‌ సవాలు చేసినట్లు మంత్రి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్