One break please: అనుపమ పరమేశ్వరన్ పేరు వినగానే .. అందమైన సీతాకోక చిలుక వంటి రూపం కళ్లముందు కదలాడుతుంది. తెరచాపల్లా కదిలే విశాలమైన ఆమె కళ్లు, మనసును మరో తీరానికి చేరుస్తాయి. సన్నజాజి మొగ్గలాంటి నాసిక .. సమ్మోహితులను చేసే నవ్వు ఆమె సొంతం. కుదురుగా .. కుందనపు బొమ్మలా కనిపిస్తూ, కుర్రహీరోల సరసన ఒదిగిపోవడం అనుపమ ప్రత్యేకత. అల్లరిపిల్లగానే కాదు .. అభినయం తెలిసిన పిల్లగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. యూత్ లోనే కాదు .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను అనుపమకి అనుపమ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
అలాంటి అనుపమకి ఆరంభంలో బాగానే సక్సెస్ లు పడ్డాయి. ‘అ ఆ’ .. ‘ప్రేమమ్’ .. ‘శతమానం భవతి’ .. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాలు ఆమె స్థాయిని పెంచుతూ వెళ్లాయి. ఆ సినిమాలు హిట్ కావడమే కాదు .. పాత్ర పరంగా ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ హిట్ అయినా, దాని వలన ఆమెకి కలిసొచ్చిందేమీ లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె హీరోయిన్ స్థానంలో కనిపించలేదు. అందువలన ఆ సినిమా వలన ఆమెకి ఒరిగిందేమీ లేదు.
ఈ నేపథ్యంలోనే కొత్త హీరో ఆశిష్ రెడ్డితో ఆమె ‘రౌడీ బాయ్స్’ చేసింది. తనకి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు మాటను కాదనలేక ఈ సినిమాను చేసిన అనుపమ, మొహమాటానికి మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె చేతిలో ’18 పేజెస్’ .. ‘కార్తికేయ 2’ .. ‘బటర్ ఫ్లై’ సినిమాలు ఉన్నాయి. మొదటి రెండు సినిమాలు నిఖిల్ జోడీగా చేస్తున్నవే. బ్యానర్ పరంగా .. కథాకథనాల పరంగా ఈ సినిమాల పైనే అనుపమ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు హిట్ అయితే మళ్లీ ఆమె ట్రాక్ లో పడే అవకాశాలు ఉన్నాయి. లేదంటే సక్సెస్ ల కోసం కాకుండా అవకాశాల కోసం వెయిట్ చేయవలసి వస్తుందంతే!
Also Read : రష్మిక …ఈ ఫ్లాప్ భారం మోయాల్సిందేనా?