Thursday, June 11, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ : కన్నబాబు

ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ : కన్నబాబు

మిరప రైతుకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. అవసరం మేరకు ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కరోనా ఉదృతిని సాకుగా చూపి  కొంత మంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.  విత్తనాలను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయించే  వ్యాపారులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రీమియం, హై బ్రీడ్ రకం  విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు  తీసుకుంటున్నట్టు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అనవసరంగా అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు.

రైతులకు అవసరమైన, డిమాండ్ ఉన్న  విత్తనాలను అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఒకటి రెండు విత్తనాల కోసమే ఎదురు చూడకుండా అధిక దిగుబడిని ఇచ్చే ఇతర విత్తనాలు వేసేందుకు రైతులను   ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular