Wednesday, April 16, 2025
HomeTrending Newsతమ్మినేనికి అస్వస్థత

తమ్మినేనికి అస్వస్థత

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న సీతారాం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఏప్రిల్ నెలాఖరులో తమ్మినేని భార్య వాణిశ్రీ కోవిడ్ బారిన పడ్డారు. అనంతరం నాలుగు రోజులకే స్పీకర్ కు కూడా కోవిడ్ సోకింది. శ్రీకాకుళం  మెడికవర్ ఆస్పత్రిలో చేరి కోవిడ్ చికిత్స పొంది మే 12న డిశ్చార్జ్ అయ్యారు.  మే 20వ తేదీన అసెంబ్లీ సమావేశాల కోసం తమ్మినేని తాడేపల్లి వచ్చారు. కొంత కాలంగా ఇక్కడే ఉంటున్న సీతారాం రెండ్రోజుల క్రితం జ్వరం మొదలైంది. దీంతో అయన ఆస్పత్రిలో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్