Saturday, January 18, 2025
HomeTrending Newsఅల్లూరి స్ఫూర్తితో పురోగమిద్దాం: బాబు

అల్లూరి స్ఫూర్తితో పురోగమిద్దాం: బాబు

అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు టిడిపి ఎంపిలు, రాష్ట్ర  మంత్రులు పయ్యావుల కేశవ్, బిసి జనార్ధన్ రెడ్డి, జనసేన ఎంపి బాలశౌరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 127వ జయంతి సందర్బంగా అల్లూరికి ఘన నివాళి అర్పించారు.

“భారత స్వతంత్ర సంగ్రామం లో మహోజ్వల శక్తి గా వెలుగొందిన శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వతంత్ర్య సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. సమసమాజ స్థాపనకు శ్రీ అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయం” అంటూ చంద్రబాబు తన సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్