Monday, May 20, 2024
HomeTrending News25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు: సిఎం

25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు: సిఎం

నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. విశాఖపట్నంలో హై-ఎండ్‌ స్కిల్‌, తిరుపతిలో స్కిల్‌ యూనివర్శిటీలను నెలకొల్పుతున్నట్లు వెల్లడించారు. ఈ స్కిల్ యూనివర్శిటీలే  నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక తయారు చేస్తాయని చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ వెల్లడించిన, అధికారులకు సూచించిన ముఖ్యాంశాలు

కోడింగ్, లాంగ్వేజెస్, రోబోటిక్స్, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా బోధన, శిక్షణ గ్రామాల్లో ఇంటర్నెట్‌సదుపాయం కల్పించడంద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్ బలోపేతం.స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు, వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుంది, దీనితో మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయి. విశాఖపట్నంలో హై ఎండ్‌స్కిల్స్‌ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలు పెట్టాలి, నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, కొత్తగా నిర్మిస్తోన్న మెడికల్‌ కాలేజీల తరగతిగదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలి, ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి, పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలి, ప్రతి ఐటీ ఐలోనూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేయాలి. టెన్త్ లోపు డ్రాపౌట్‌ అయిన యువకులకు నైపుణ్యాభిద్ధిపై దృష్టిపెట్టాలి.

⦿కొత్తగా వచ్చే పరిశ్రమలకుబ ట్రైనింగ్‌ పొందిన వారి డేటాను పంపించాలి

⦿75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి

⦿పారిశుద్ధ్యంకోసం వినియోగిస్తున్న పరికరాలచ నిర్వహణ, మరమ్మతుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలి

⦿ఇలా నిత్యజీవితంతో సంబంధం ఉన్న అంశాల్లో నైపుణ్యం ఉన్న మానవనరులను అభివృద్ధి చేయాలి

⦿ఇంగ్లిషు భాషలో కూడా పరిజ్ఞానాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలి

⦿నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలి

⦿ప్రైవేటు ఐటీఐల్లో కనీస సదుపాయాలపైనకూడా దృష్టిపెట్టాలి

⦿ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికేషన్‌ చేయించాలి

⦿ప్రతికాలేజీ, ఐటీఐ కూడా నిర్దేశిత ప్రమాణాలను సాధించే దిశగా అడుగు ముందుకేయాలి

⦿ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించాలి

⦿ప్రభుత్వ ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో టీచింగ్‌ సిబ్బందిపై పరిశీలన చేయాలి

⦿ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇప్పించాలి

⦿శిక్షణ పొందిన వారికి అప్రంటిషిప్‌ వచ్చేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి

⦿నిపుణుల చేత బోధన ఇప్పించేటప్పుడు దాన్ని డిజిటల్‌ పద్ధతిలో పొందుపర్చాలి

⦿మరింత మందికి శిక్షణ ఇచ్చేందుకు ఆ వీడియోలను వినియోగించుకోవచ్చు

ఈ సమీక్షా సమావేశానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ మరియు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ లావణ్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె అజయ్‌ రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌ బంగార్రాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్