Monday, February 24, 2025
HomeTrending Newsహైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

CM met CJ: ఆంధ్రప్రదేశ్‌  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఈనెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు.

ఏప్రిల్‌ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితోపాటు, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయసహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ–కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటికి సంబంధించి రాష్ట్ర నుంచి నివేదించనున్న అంశాలపై ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చర్చించారు. హైకోర్టు ఉన్నత పరిపాలనా అధికారులు, రాష్ట ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్