మచిలీపట్నం మాజీ ఎంపి కొలుసు పెద రెడ్డయ్య మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, పార్టీ సహచరులతో కలిసి విజయవాడ స్వరాజ్య మైదానం ఎదురుగా ఉన్న రెడ్డయ్య నివాసానికి చేరుకొని నివాళులర్పించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెడ్డయ్య ఈ తెల్లవారుఝామున తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1991లో మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్ధి కావూరు సాంబశివ రావుపై గెలుపొందారు. కేపీ రెడ్డయ్య కుమారుడు కొలుసు పార్థసారథి ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున పెనమలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో మంత్రిగా కూడా సారథి పని చేశారు.
రెడ్డయ్య మరణం రాష్ట్రానికి తీరని లోటని సిఎం జగన్ పేర్కొన్నారు. రెడ్డయ్య సతీమణితో పాటు కుమారుడు సారథిని సిఎం జగన్ ఓదార్చారు.