Friday, March 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బాబు మమ్మల్ని మనుషులుగా చూశారా?

బాబు మమ్మల్ని మనుషులుగా చూశారా?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అటు అధికారంలోనూ, ఇటు సంక్షేమ కార్యక్రమాల్లోనూ పెద్దఎత్తున భాగస్వామ్యులను చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్  మోహన్ రెడ్డి అని డిప్యుటీ సిఎం కే. నారాయణస్వామి అన్నారు.  గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి గుర్తింపు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఈ వర్గాలను అసలు మనుషులుగా చూశారా అని నిలదీశారు. తిరుపతిలో అయన మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ పదవుల ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.

చంద్రబాబు వల్ల ఒక దళితుడిగా తాను కూడా ఎంతో ఇబ్బందిపడ్డానని, టీడీపీగానీ, చంద్రబాబుగానీ ఎప్పుడూ హరిజనవాడకు వెళ్ళి ఓటు అడగలేదని విమర్శించారు. ఎస్సీలను చంద్రబాబు మొదటి నుంచీ దూరం పెట్టేవారని గుర్తు చేశారు.  టీడీపీలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఇప్పటికైనా ఆలోచించాలని నారాయణస్వామి హితవు పలికారు.

చంద్రబాబు ఎప్పుడూ అభివృద్ధి చేశాం అని చెబుతుంటారని… కానీ మా ప్రభుత్వం చేస్తున్న ఇంగ్లీషు మీడియం చదువులు, పక్కా ఇళ్ళ నిర్మాణం అసలైన అభివృద్ధి అని వివరించారు. చంద్రబాబు దృష్టిలో అభివృద్ధి అంటే  తన మనుషులు బాగుపడటమేనని ఎద్దేవా చేశారు.  జగన్ నాయకత్వంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

చంద్రబాబు మానవత్వం లేని వ్యక్తి అని రోడ్డు వేసి, పింఛను ఇచ్చి.. అన్నీ నేనే చేశానని చెప్పుకుంటారని, గతంలో నంద్యాల ఎన్నికల ప్రచారంలో అలానే చెప్పారని నారాయణ స్వామి గుర్తు చేసుకున్నారు. పేదలకు ఇన్ని చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారు ఏరోజైనా అలా చెప్పారా అని బాబును ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్