Monday, June 8, 2026
Homeసినిమానాగచైతన్య - తరుణ్ భాస్కర్ కాంబినేషన్

నాగచైతన్య – తరుణ్ భాస్కర్ కాంబినేషన్

అక్కినేని నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఆగష్టులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన ‘థ్యాంక్యూ’ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో అమీర్ ఖాన్ తో కలిసి నాగ చైతన్య నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతా ‘బంగార్రాజు’ షూటింగ్ లో చైతన్య జాయిన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నాగచైతన్య మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అదే.. తరుణ్ భాస్కర్ తో మూవీ అని సమాచారం.

తరుణ్ భాస్కర్.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడుగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే సక్సస్ సాధించి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే సినిమా తెరకెక్కించారు. ఆతర్వాత వెంకటేష్ తో సినిమా చేసేందుకు కథ పై కుస్తీ పడుతూనే ఉన్నారు కానీ.. ఇంకా సెట్ కాలేదు. అయితే.. ఇప్పుడు నాగచైతన్య కోసం కథ రెడీ చేశారని.. వీరిద్దరి కాంబినేషన్లో మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్‌ బాబు నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్. మరి.. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular