Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్శ్రీలంక సిరీస్ :  తొలివన్డేలో ఇండియా విజయం

శ్రీలంక సిరీస్ :  తొలివన్డేలో ఇండియా విజయం

శ్రీలంక సిరీస్ లో ఇండియా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబో లోని ప్రేమదాస స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. లంక జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. కరుణ రత్నే43(35), కెప్టెన్ శనక 39 (50); అసలంక 38 (65); అవిష్క ఫెర్నండో 33(35) లు రాణించారు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్, చాహల్, దీపక్ చాహర్ లు తలా రెండేసి వికెట్లు సాధించారు. పాండ్యా సోదరులు చెరో వికెట్ సాధించారు.

263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 36.4 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ 95 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్సర్ తో 86 ;  పృథ్వీ షా 24 బంతుల్లో  9 ఫోర్లతో 43;  ఇషాన్ కిషన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్సర్లతో 59 ; సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో  5ఫోర్లతో 31పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. శ్రీలంక బౌలర్లలో ధనుంజయ డిసిల్వా రెండు వికెట్లు సాధించారు. పృథ్వీ షా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. మూడు వన్డేల సిరీస్ లో ఇండియా ­1-0 తో పైచేయి సాధించింది.  మంగళ, శుక్రవారాల్లో మిగిలిన రెండు మ్యాచ్ లు జరుగుతాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్