Wednesday, May 8, 2024
Homeసినిమా‘పక్కా కమర్షియల్’ కు మంచి స్పందన

‘పక్కా కమర్షియల్’ కు మంచి స్పందన

‘ప్ర‌తి రోజు పండ‌గే’ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ త‌రువాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి  హీరో గోపీచంద్ తో తెరకెక్కిస్తోన్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇదే రీతిన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని కీల‌క ప్ర‌క‌ట‌నలను సైతం ద‌ర్శ‌కుడు మారుతి త‌న‌దైన శైలిలో విడుద‌ల చేస్తూ వచ్చారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సింహ భాగం పూర్తయింది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలతో పాటు, అల్లు స్టూడియోస్, అన్న‌పూర్ణ స్టూడియోల్లో ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతుంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుటికే విడుదలైన పోస్టర్లలో కూడా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి ‘భ‌లేభ‌లే మ‌గాడివోయ్’, ‘ప్ర‌తిరోజు పండ‌గే’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. సత్యరాజ్ మరోసారి మారుతి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జాక్స్ బిజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియ జేయనుంది. ఆగ‌స్ట్ 3, 2021తో తెలుగు చిత్ర సీమకు అడుగుపెట్టి రెండు ద‌శాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు గోపీచంద్. ఈ పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ సక్సెస్స్ సాధిస్తారని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్