విక్టరీ వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ఈ నెల 20న డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అవుతుంది. ఈ సినిమా తర్వాత వెంకీ నటించిన ‘దృశ్యం-2’ కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాను కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం వెంకటేష్ ‘ఎఫ్-3’ చేస్తున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇటీవల వెంకటేష్ నారప్ప ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు అని అడిగితే.. మనం చాలా అనుకుంటా కానీ ఏదీ జరగదు. ఎలా రాసిపెట్టి ఉంటే.. అలా జరుగుతుంది. టైమ్ కలిసొస్తే సాధ్యపడుతుంది.. స్క్రిప్టు నిర్ణయిస్తుంది. నా చేతిలో ఏమీ లేదు అని తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఆతర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్.. లతో సినిమాలు చేసేందుకు కథలు రెడీ చేస్తున్నారు. అలాగే రామ్ తో కూడా త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో వెంకీతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానాలు మొదలయ్యాయి. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *