Thursday, November 21, 2024
HomeTrending Newsబెంగుళూరుకు పవన్ కళ్యాణ్: కుంకీ ఏనుగుల కోసం వినతి

బెంగుళూరుకు పవన్ కళ్యాణ్: కుంకీ ఏనుగుల కోసం వినతి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు,  కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలన్న ప్రధాన విజ్ఞప్తితో ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖంద్రేతో చర్చలు జరపడమే ఈ టూర్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ భేటీకి ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఇటీవల తన శాఖలపై సమీక్ష చేస్తున్న సందర్భంలో అటవీశాఖ అధికారులతో సమావేశమైనప్పుడు  ఏనుగుల గుంపు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో.. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వచ్చారు.  కుంకీ ఏనుగుల కొరత ఉందని.. అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. ఏపీలో రెండు కుంకీ ఏనుగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని,  కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాన్.. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని చెప్పారు.

దీనిలో భాగంగానే పవన్ బెంగళూరుకు వెళ్లారు. ఏపీకి ఆరు కుంకీ ఏనుగుల్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్నికోరనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్