Sunday, January 19, 2025
HomeTrending Newsమాజీ మంత్రి బొజ్జల కన్నుమూత

మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత

Bojjala Died: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా  అనారో గ్యంతో బాధపడుతున్న బొజ్జలకు గుండెపోటు వచ్చింది, వెంటనే  ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. కాసేపటి క్రితం ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బొజ్జల వయసు 73 సంవత్సరాలు. 1949 ఏప్రిల్ 15న చిత్తూరు జిల్లా ఉరందూరులో జన్మించిన బొజ్జల శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా పేరున్న బొజ్జల అయన మంత్రివర్గంలో రోడ్లు భవనాలు, ఐటి, చిన్న నీటిపారుదల, సహకార, అటవీ-పర్యావరణ శాఖలు నిర్వహించారు. అలిపిరి వద్ద నాటి సిఎం బాబుపై నక్సలైట్లు మందుపాతర పేల్చిన సమయంలో బొజ్జల కూడా బాబు వెంట అదే వాహనంలో ఉన్నారు. ఆ ఘటనలో బొజ్జల గాయపడి కోలుకున్నారు.

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ కు కూడా అత్యంత సన్నిహితుడు.

ఇటీవలే బొజ్జల పుట్టినరోజు సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరలోనే కోలుకొని మళ్ళీ ప్రజల వద్దకు రావాలని బాబు ఆకాంక్షించారు. అయితే అనారోగ్యం తిరగబెట్టడంతో చికిత్స పొందుతూ నేడు మరణించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్