పదోతరగతి పరీక్షలు వాయిదా వేయాలనిప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. అయితే రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పట్లో స్కూళ్ళు తెరిచే ఆలోచన కూడా లేదని కోర్టుకు వివరించింది. కరోనా రెండో దశ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్ధులు, తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్షాలు కూడా కోరుతున్నాయి. అయితే విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. జూన్ 8 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా కేసుల్లో తగ్గుదల లేకపోవడంతో ప్రస్తుతానికి వాయిదాకే ప్రభుత్వం కూడా మొగ్గుచూపింది. జులైలో మరోసారి సమీక్ష జరిపి పరిక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలియపరిచింది.
పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే పరీక్షలు జరపాలని పిటిషనర్ కోరారు. ఒకవేళ పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం సిద్ధమైతే తప్పనిసరిగా జూన్ 1లోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.