రాష్ట్రంలో ఇవాల్టి నుంచి భూముల ధరలు పెరుగుతున్నాయి. అర్బన్ ఏరియాలు, కొన్ని రూరల్ సెంటర్లలో కూడా ధరలు పెంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనీసం 29 నుంచి 31 శాతం ధర పెరగనుంది. కొత్త రేట్ల ప్రకారం రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే ధరలు పెంచుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలోని 20% మేర గ్రామీణ ప్రాంతాల్లో ధరల సవరణ జరుగుతుంది. మొత్తంగా 2318 ప్రాంతాల్లో కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో 7 మండలాల్లో మాత్రమే ధరలు పెరిగాయి. అలాగే హైవేలు, పరిశ్రమలు ఉన్నచోట అధిక ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చివరి సారిగా 2020లో భూముల ధరలు పెరిగాయి. ఆ తర్వాత రాష్ట్రంలో భూముల ధరలు పెంచలేదు. గత ఏడాది అర్బన్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి.