Council may continue:
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నేడు మరో కీలక తీర్మానం ఆమోదించబోతోంది. శాసనమండలి రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నేడు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నిన్న సోమవారం పరిపాలనా వికేంద్రీకరణ, సిఆర్డీయే రద్దుపై గతంలో చేసిన చట్టాన్ని ఉపసంహరించుకున్న ప్రభుత్వం నేడు మండలిపై అదే తరహా తీర్మానం చేయనుంది.
మూడు రాజధానులపై 2019 డిసెంబర్ లో అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని మండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. నాడు మండలిలో టిడిపికి మెజార్టీ ఉండడంతో ఈ బిల్లును అడ్డుకున్నారు. దీనితో ఏకంగా మండలినే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో మండలిలో వైఎస్సార్సీపీ బలం పెరిగింది. ఈ నెలాఖరుకు 33 మంది సభ్యులతో సంపూర్ణ మెజార్టీ సాధించబోతోంది. దీనితో మండలి విషయంలో నాడు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రానికి తెలియజేస్తూ నేడు తీర్మానం చేయనున్నారు.
నిన్న కేబినేట్ లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది
Also Read : మరో బిల్లుతో ముందుకొస్తాం: జగన్