ఆర్ధిక శ్వేతపత్రం: టిడిపి ఎంపీల డిమాండ్

White Paper:
జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిందని, గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు వాడుకుంటున్నారని, విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఉన్న బకాయిలు చెల్లించడం లేదని వివరించారు

ఈ రెండున్నరేళ్ళలో జగన్ ప్రభుత్వం మొత్తం 3 లక్షల 8 వేల  కోట్ల రూపాయల అప్పులు చేసిందని, ఇవి కాక ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, హెల్త్ యూనివర్సిటీ నిధులు 400  కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారని కనకమేడల వివరించారు. ఢిల్లీ లోని తన నివాసంలో లోక్ సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన ఎప్పుడూ ఢిల్లీ నార్త్ బ్లాక్ లోనే ఉంటారని, ఆర్ధిక శాఖకు సలహా దారులు కూడా ఉన్నారని, అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆర్ధిక విషయాలను మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం కట్టని ఇళ్ళకు కూడా ఒటీఎస్ పేరుతో పన్నులు వస్తూలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాజెక్టులు పక్కన పెట్టడం కూడా రాష్ట్ర ఆర్ధిక తిరోగమనానికి మరో కారణమని రవీంద్ర కుమార్ చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యక హోదా ఎప్పుడు తెస్తారో చెప్పాలని వైసీపీ ఎంపీలను రామ్మోహన్ నాయుడు నిలదీశారు. రాష్ట్రానికి సంబంధించిన ఏఒక్క అంశంపై పార్లమెంట్ లో గట్టిగా నిలదీయలేని స్థితిలో వారు ఉన్నారని విమర్శించారు. పక్క రాష్ట్రం తెలంగాణ లో వారి సమష్య కోసం లోక్ సభ వెల్ లోకి వెళ్లి పోరాటం చేస్తున్నారని, కానీ 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్య సభ సభ్యులు ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారని, వారి చేత కాని తనాన్ని కూఒడా చంద్రబాబుపై రుద్దాలని చూస్తున్నారని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు.

Also Read : హైదరాబాద్ లో ఓమిక్రాన్ లక్షణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *