Saturday, April 20, 2024
HomeTrending Newsతెలంగాణలో మాస్క్ తప్పనిసరి

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి

తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి మాస్క్ పెట్టుకోకుంటే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రూ. వెయ్యి ఫైన్ విధిస్తారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ‘తెలంగాణలో ఇంకా 25 లక్షల మంది రెండో డోస్ తీసుకోలేదు. ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 6 లక్షల మంది ఉన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కలుపుకొని జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 15 లక్షల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారున్నారు. వ్యాక్సిన్ తీసుకోకపోతే మీ ప్రాణాలను మీరే తీసుకున్నట్లు అవుతుంది. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు మాస్క్ కూడా పెట్టుకోవాలి. వ్యాక్సిన్ కన్నా మాస్క్ పవర్ ఫుల్ వెపన్. మాస్క్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయల ఫైన్ నేటినుంచి తిరిగి అమల్లోకి వస్తోంది. అన్ని ఆఫీసులలో, బహిరంగ ప్రదేశాలలో మాస్క్ తప్పకుండా ధరించాలి. వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అందుకే మీ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను మీ ఫోన్ లో గానీ, లేదా హార్డ్ కాపీని వెంట ఉంచుకోవాలి. ఎక్కడైనా చెకింగ్ జరగొచ్చు. త్వరలోనే కొత్త గైడ్ లైన్స్ విడుదల చేస్తాం’ అని ఆయన తెలిపారు.

మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు సూచించిన వైద్యశాఖ. ఈ రోజు మాస్క్ ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. మాస్క్ ఖచ్చిత0గా ధరించాలని, బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలన్నారు.

వ్యాక్సిన్ పై ఖచ్చితమైన నిబంధనలు ప్రభుత్వ అనుమతితో రూపొందించబోతున్నామని, హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకొని వారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ అమలులోకి రానుంది.

Also Read : హైదరాబాద్ లో ఓమిక్రాన్ లక్షణాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్