కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

2014 జూన్ 2 నాటికి ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు కేబినేట్ సబ్ కమిటీ అంగీకరించింది. స్పెషల్ పే ఇవ్వడానికి, పే రివిజన్ కమిషన్ కమీషనర్ నియామకానికి కూడా ఒకే చెప్పింది.  ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాప్ కౌన్సిల్ తో కేబినేట్ సబ్ కమిటీ సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ  కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేలా త్వరలోనే ఉత్తర్వులు విడుదల చేస్తామని ప్రకటించారు. గురుకులాలు, యూనివర్సిటీలలో పదవీ విరమణ వయసున్ను 60 నుంచి 62 పెంచేందుకు నిర్ణయించామని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థల్లోని ఉద్యోగుల విషయంలో కోర్టులో కేసు నడుస్తోందని దాని తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, వారు తమ కుటుంబ సభ్యులని మొదటినుంచీ చెబుతున్నామని, సమస్యల పరిష్కారంలో కొంత ఆలస్యమైనా, సిఎం జగన్  ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారని బొత్స అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కలిసికట్టుగా ముందుకు తీసుకు వెళ్లేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపు ఇచ్చారు.

ఈసమావేశంలో రాష్ట్ర విద్యా శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ,మున్సిపల్ శాఖామాత్యులు ఆదిమూలపు సురేశ్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి,ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్ యం) చిరంజీవి చౌదరి,ఆర్థిక శాఖ కార్యదర్శి డా.కెవివి.సత్యనారాయణ,(సర్వీసెస్ మరియు హెచ్ ఆర్ యం) కార్యదర్శి పి.భాస్కర్, రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాస్, అమరావతి జెఎసి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె. వెంకట్రామిరెడ్డి,ఎస్టియు అధ్యక్షులు సాయి శ్రీనివాస్, పిఆర్టియు అధ్యక్షులు కృష్ణయ్య,యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎపిటిఎఫ్ అధ్యక్షులు హృదయరాజు,ఎపి జిఇఎ కార్యదర్శి ఆస్కార్ రావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గోపాల కృష్ణ,ఎపి ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు శ్రావణ కుమార్, జాయింట్ స్టాప్ కౌన్సిల్లోని ఆయా సంఘాల కార్యదర్శులు,ఇంకా ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *