Saturday, January 18, 2025
HomeTrending Newsనేడే ‘వైఎస్సార్ అవార్డుల’ ప్రదానం

నేడే ‘వైఎస్సార్ అవార్డుల’ ప్రదానం

AP Governor Cm To Present Ysr Lifetime Achievement Awards :

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తోన్న ‘వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌’ అవార్డుల ప్రదానం నేడు జరగనుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

సామాన్యులలో అసామాన్య ప్రతిభను గుర్తించి సత్కరించాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రవేశపెట్టింది. వరుసగా రెండో ఏడాది ఈ అవార్డులు అందిస్తున్నారు. గత ఏడాదికంటే భిన్నంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తోన్న వ్యక్తులు సంస్థలకు వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ కలిపి మొత్తం 59 అవార్డులు అందజేస్తున్నారు. వీటిలో 9 సంస్ధలు; వ్యవసాయ, అనుబంధ రంగాలకు 11; కళలు, సాంస్కృతిక రంగాలకు 20; సాహిత్యం 7; జర్నలిజం 6; కోవిడ్‌లో సేవలందించిన 6 మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఇవ్వనున్నారు.

నేడు, నవంబర్ 1న ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ – కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీతలకు 10 లక్షల రూపాయల నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌…. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల విజేతలకు 5 లక్షల రూపాయల నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ అందజేస్తారు.

Must Read : ఏది ప్రభుత్వం? ఏది ప్రయివేటు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్