High Court on PRC: ఉద్యోగుల పీఆర్సీ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జీతాల్లో రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దమని ధర్మాసనం అభిప్రాయపడింది.
పీఆర్సీపై ఆశుతోష్ మిశ్రా నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వలేదని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోల్లో ఎరియర్స్ కట్ చేసే అంశాన్ని పొందుపరిచారని పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళారు. అయితే రికవరీ అంశం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అన్ని విషయాలతో సమగ్రంగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది.
Also Read : కోట్లాదిమందికి ఆనందం పంచిన బ్రహ్మానందం