Monday, January 20, 2025
HomeTrending Newsఓర్వలేకపోతున్నారు: గుడివాడ ఆరోపణ

ఓర్వలేకపోతున్నారు: గుడివాడ ఆరోపణ

ప్రభుత్వంపై చంద్రబాబు పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని, ఆయనకు మతి తప్పిందని…. మరోవైపు వెయిట్ లాస్ కోసం ప్రయతిస్తున్న లోకేష్ కు మైండ్ లాస్ అయ్యిదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రంగా మండిపడ్డారు.  రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అమర్నాథ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ  వచ్చినా అది తామే తీసుకొచ్చామని చెబుతున్నారని,  వారి హయంలో పెట్టుబడుల పేరుతో డ్రామాలు చేశారని, కానీ తాము పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 100కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు వెయ్యికి పైగా ఉన్నాయని చెబుతున్న లోకేష్ వాటి వివరాలు బహిర్గతం చేయాలని సవాల్ చేశారు.  రాష్ట్రం పారిశ్రామికంగా  అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. 14 ఏళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధి జరగాలని ఆలోచించారా అని ప్రశ్నించారు.  తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.

జపాన్ కాన్సులేట్ జనరల్ కూడా నిన్నటి సమావేశంలో పాల్గొని వారి దేశం నుంచి మరికొంతమంది పారిశ్రామిక వేత్తలను ఇక్కడ పెట్టుబడి పెట్టేలా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారని అమర్నాథ్ చెప్పారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్తంభాల మీదే సిఎం జగన్ పాలన సాగిస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్ళ బాబు పాలనలో నాలుగు సార్లు పార్టనర్ షిప్ సమ్మిట్ లు పెట్టి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అంటూ ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.

తమ పార్టీపై కాపుల ముద్ర వేస్తున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై గుడివాడ స్పందించారు. పవన్ కళ్యాణ్ దికాపు జనసేన కాదని, కమ్మ జన సేన అని అభివర్ణించారు. స్క్రిప్ట్ అంతా టిడిపి ఇస్తుంటే డైరక్షన్ నాదెండ్ల మనోహర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానిపై కాపుల ముద్ర తాము వేయలేదని, ఆయనే కమ్మ సేన గా అనిపించుకుంటున్కునారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్