Saturday, January 18, 2025
HomeTrending Newsమేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

Gowtham no more: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. అయన వయసు
49 సంవత్సరాలు. 1972 నవంబర్ 2న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు. సీనియర్ రాజకీయ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ 2014లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో మరోసారి ఎన్నికయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినేట్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు దుబాయ్ లో జరిగిన దుబాయ్ ఎక్స్ పో లో పాల్గొని నిన్ననే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. 5,150  కోట్ల రూపాయల  పెట్టుబడులు తీసుకురావడంలో కృషి చేశారు.

ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్