Sunday, February 23, 2025
HomeTrending Newsఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు: వైవీ

ఏప్రిల్ 1 నుంచి ఆర్జిత సేవలు: వైవీ

Sevas Soon: ఏప్రిల్ 1 నుంచి  శ్రీ‌వారి అన్ని ఆర్జిత సేవలను పునః ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆర్జిత సేవ ధరలు పెంచబోవడం లేదని స్పష్టం చేశారు. కేవలం సిఫార్సు లేఖలపై అందించే ఆర్జిత సేవల టిక్కెట్లను పెంచే విషయాన్ని పరిశీలించామని తెలిపారు.  తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్రసాద భ‌వ‌నం, పిఏసి – 4 (పాత అన్నప్రసాద భ‌వనం) లోని ల‌గేజి సెంట‌ర్‌ను ఆలయ అధికారులతో కలిసి సుబ్బారెడ్డి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  ఎలాంటి నియంత్రణ లేకుండా సాధారణ స్థాయిలోనే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తున్నామని చెప్పారు. కొండమీద హోటళ్ళు, రెస్టారెంట్లు యధావిధిగా నడుస్తాయని చెప్పారు. ద‌ర్శనానికి వచ్చే సామాన్య భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌక‌ర్యవంత‌మైన ద‌ర్శనం అందిస్తామని,  భక్తులు ఎంతమంది వచ్చినా రుచిక‌రమైన  అన్నప్రసాదాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.  తిరుమలలో అదనంగా మరో రెండు ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ చేయాలని ఆదేశించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

Also Read : శని, ఆదివారాల్లో కూడా విఐపి బ్రేక్ రద్దు

RELATED ARTICLES

Most Popular

న్యూస్