Saturday, June 13, 2026
Homeసినిమా#NBK108లో అర్జున్ రాంపాల్

#NBK108లో అర్జున్ రాంపాల్

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK108లో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది  నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ తెర పైకి వచ్చారు. అనౌన్స్‌మెంట్ వీడియోలో అర్జున్ రాంపాల్, బాలకృష్ణ లెజెండ్ చిత్రంలోని ”ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు” అనే పాపులర్ డైలాగ్ చెప్పారు.

ఇందులో అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి మధ్య సంభాషణ కూడా వుంది.  ఈ సినిమాతో అర్జున్ రాంపాల్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ లని కలిసి తెరపై చూడటం ఆసక్తికరంగా ఉండబోతుంది.

ఉగాది సందర్భంగా బాలకృష్ణ ను రెండు డిఫరెంట్ లుక్ లో ప్రజంట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. #NBK108కి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. NBK108 విజయదశమి (దసరా)కి థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular