Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Arjuna Phalguna Second Single Released :

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదలైన పాట అందరినీ ఆకట్టుకుంది. నేడు ‘కాపాడేవా రాపాడేవా?’ అనే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అద్భుతమైన బాణీని ఇచ్చారు.

ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మోహన భోగరాజు గాత్రం అలరిస్తోంది. టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన రాగా.. ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Must Read :  శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’ నుంచి ‘గోదారి వాల్లే సందమామ’ పాట

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com