మోచ తుపాన్ ధాటికి మయన్మార్‌లోని అనేక గ్రామాలు కకావికలమవుతున్నాయి. తుఫాన్ మృతుల సంఖ్య మంగళవారం నాటికి 81కి చేరుకున్నది. ఒక్క రాఖినీ రాష్ట్రంలోనే 41 మంది చనిపోయారు. తీరప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతపట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. తుఫాను ధాటికి వందల మంది గల్లంతయ్యారు.
రాఖినే రాష్ట్రంలో సుమారు 17 పట్టణాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో వంతెనలు తెగిపోవటంతో బాధితులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోయారు. దీంతో మహిళలు, పిల్లలు ఆకలికి అలమటిస్తున్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ జిల్లాలో రెండు వేళ ఇల్లు నేలమట్టం అయ్యాయి. పది వేలమంది నిరాశ్రయులయ్యారు. తీర ప్రాంతంలోని గ్రామాల్లో అయిదు మీటర్ల వరకు నీరు నిలవటం..సహాయ కార్యక్రమాలకు అంతరాయంగా మారింది.