ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ప్రోటీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్  బౌలర్లలో కామెరూన్ గ్రీన్ ఐదు వికెట్లతో రాణించగా, స్టార్క్ రెండు; బొలాండ్, లియాన్ చెరో వికెట్ సాధించారు. తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆసీస్ మొదటి రోజు ఆట ముగిసే నాటికి ఒక వికెట్ కోల్పోయి 45 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి రబడ బౌలింగ్ లో ఔట్ కాగా, డేవిడ్ వార్నర్- 32; లబుషేన్-5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. తొలి టెస్టులోఆసీస్ ఆరు వికెట్లతో విజయం సాధించింది. రెండో టెస్టు మెల్బోర్న్ లో నేడు మొదలైంది. ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా జట్టులో మార్కో జన్సేన్-59; వెర్రేఎన్-52 పరుగులతో రాణించారు. కెప్టెన్ ఎల్గర్ -26 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *