Saturday, January 18, 2025
Homeసినిమాప్ర‌భాస్ స‌లార్ వ‌చ్చేది ఎప్పుడు..?

ప్ర‌భాస్ స‌లార్ వ‌చ్చేది ఎప్పుడు..?

Next Year only: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ గా నిల‌వ‌డంతో అభిమానులు తర్వాతి సినిమా సలార్ కోసం ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కేజీఎఫ్ 2 చరిత్ర సృష్టించ‌డంతో స‌లార్ మూవీ పై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ఎప్పుడెప్పుడు స‌లార్ అప్ డేట్స్ వ‌స్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసి చాలా రోజులు అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా కేవ‌లం 30 శాతం షూటింగ్ మాత్ర‌మే పూర్త‌య్యింది. దీనికి కార‌ణం.. ప్ర‌భాస్ వేరే ప్రాజెక్టులో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఎక్కువ డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే. అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని అంతా అనుకున్నారు కానీ.. ఈ సినిమా ఈ ఏడాదిలో రావడం లేదనేది తాజా సమాచారం.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. అందువలన వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా శృతి హాసన్ న‌టిస్తోంది. వీరిద్ద‌రి పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇక టీజ‌ర్ ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. స‌లార్ సెన్సేష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read : మరింత లేటుగా మారుతూ-ప్రభాస్ మూవీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్