Sunday, January 19, 2025
Homeసినిమాక్రిష్ టెన్షన్ తీర్చిన పవర్ స్టార్

క్రిష్ టెన్షన్ తీర్చిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అయితే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో హరి హర వీరమల్లు సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే.. ఈ సినిమా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ.. కొన్ని కారణాల వలన బాగా ఆలస్యం అయ్యింది. దీంతో బడ్జెట్ బాగా పెరిగింది. దీంతో డైరెక్టర్ క్రిష్ ,  ప్రొడ్యూసర్ ఏఎం రత్నం  ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని తెగ టెన్షన్ పడుతున్నారట. ప‌లుమార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా చివ‌ర‌గా 2023 వేస‌వికి ఫిక్స్ అయింది కానీ.. ప‌వ‌న్ తీరు చూస్తుంటే అప్ప‌టికైనా సినిమా రిలీజ‌వుతుందా లేదా అన్న సందేహాలు క‌లిగాయి. అయతే… హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం టెన్ష‌న్ తీరుస్తూ.. ప‌వ‌న్ ఇటీవ‌ల రెగ్యులర్ గా షూటింగ్‌కు హాజ‌రు కావ‌డం విశేషం.

చాలా నెల‌ల త‌ర్వాత ప‌వ‌న్‌.. గ్యాప్ ఇవ్వ‌కుండా దాదాపు రెండు వారాలు రెగ్యుల‌ర్‌గా షూటింగ్‌కు వ‌చ్చాడ‌ట‌. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్‌, పెద్ద సంఖ్య‌లో ఆర్టిస్టులు, వేల‌మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల కాంబినేష‌న్లో కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ప‌వ‌న్ పూర్తి చేశాడ‌ట‌. ఈ షెడ్యూల్ బ్రేక్ లేకుండా సాగిపోవ‌డంతో మేజ‌ర్ పార్ట్ ఫినిష్ అయిపోయిన‌ట్లు స‌మాచారం. ఇలా ఇంకో మూడు వారాలు ప‌వ‌న్ కాల్ షీట్లు ఇస్తే సినిమా పూర్త‌యిపోతుంద‌ని సమాచారం. మరి.. సమ్మర్ కి వచ్చేందుకు రెడీ అవుతున్న వీరమల్లు ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్