Thursday, June 18, 2026
HomeసినిమాRajinikanth: సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై?

Rajinikanth: సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘జైలర్’ ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇది రజనీ 169వ చిత్రం. దీని తర్వాత టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో 170వ సినిమాలో నటించ్చనున్నారు. అలాగే ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్న ‘లాల్ సలామ్’లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈమధ్య కాలంలో రజనీ నుంచి బ్లాక్ బస్టర్ మూవీ రాలేదు. వరుసగా సినిమాలు వస్తున్నాయి కానీ.. ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో తమిళ దర్శకుడు మిస్కన్ చేసిన వ్యాఖ్యలు అందరికీ షాక్ కలిగించాయి. “రజనీకాంత్ 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ తో చేయనున్నారు. ఇదే ఆయన చివరి సినిమా…. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా”రంటూ  చెప్పారు. ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన కెరీర్ కు ఈ సినిమాతో ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారట. ర జనీకాంతే స్వయంగా లోకేష్ ని సంప్రదించారని.. ఆయనతో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించారని చెప్పారు.

ఈ వార్త కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. రజనీ అభిమానులు ముందు షాక్ కు గురైనా ఆయన ఆరోగ్య కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియడంతో శాంతించారు. అయితే.. రజనీకాంత్ కానీ.. లోకేష్‌ కనకరాజ్ కానీ ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై స్పందించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular