Thursday, June 18, 2026
HomeసినిమాCustody: చైతన్య కూడా లెటర్ రాస్తాడా?

Custody: చైతన్య కూడా లెటర్ రాస్తాడా?

అక్కినేని నాగచైతన్య ఎంతో కష్టపడి చేసిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ బోల్తా పడింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేసినప్పటికీ.. ఎక్కడో మ్యాజిక్ మిస్ అయ్యింది. ఈమధ్య అక్కినేని హీరోలకు ఏమాత్రం కలిసి రావడం లేదు. నాగచైతన్య నటించిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ చిత్రాలు వరుస ఫ్లాప్ లు గా నిరాశపరిచాయి.

అఖిల్ ‘ఏజెంట్’ కూడా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. దీనితో నిర్మాత అనిల్ సుంకర సారీ చెబుతూ ఓ లెటర్ రాశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అఖిల్ కూడా ఓ లెటర్ రాశాడు. ‘అందర్నీ ఎంటర్ టైన్ చేయాలని ప్రయత్నించాం కానీ.. మేము అనుకున్నది స్క్రీన్ పైకి రాలేదు. ఈసారి మంచి కథతో మీ ముందుకు వస్తా’నంటూ అఖిల్ రాశాడు. ఇప్పుడు చైతన్య కూడా లెటర్ రాస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

‘కస్టడీ’ ఫ్లాప్ పై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. దర్శకుడు వెంకట్ ప్రభు తమిళ్ లో విజయ్ తో మూవీ చేయనున్నాడు. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి…  రామ్, బోయపాటి మూవీలో బిజీ అయ్యారు. ఇక నాగచైతన్య మాత్రం నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. కస్టడీ రిజెల్ట్ చైతన్యకు పెద్ద షాక్ అని చెప్పచ్చు. ఇలాంటి టైమ్ లో నాగచైతన్య కూడా ఓ లెటర్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బాగుంటుంది కొంత మంది అభిమానులు అనుకుంటున్నారు. అయితే.. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాడు కానీ.. ఇప్పుడు అంతలా స్పందించాల్సిన అవసరం లేదని మరికొంత మంది అభిమానుల వాదన. మరి.. చైతన్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular