Thursday, April 18, 2024
Homeసినిమాఎన్టీఆర్ మూవీలో న‌టించే బాలీవుడ్ బ్యూటీ ఎవ‌రు?

ఎన్టీఆర్ మూవీలో న‌టించే బాలీవుడ్ బ్యూటీ ఎవ‌రు?

Who’s that Beauty: యంగ టైగ‌ర్ ఎన్టీఆర్.. కొర‌టాల శివ‌తో ఓ భారీ చిత్రం, ప్ర‌శాంత్ నీల్ తో ఓ భారీ చిత్రం చేసేందుకు ఓకే చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ రెండు భారీ చిత్రాల‌ను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమాలు సెట్స్ పైకి వ‌స్తాయా..? ఎప్పుడెప్పుడు ఈ సినిమాల‌కు సంభందించిన అప్ డేట్స్ వ‌స్తాయా..? అని యంగ్ టైగర్ అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ సినిమాకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే.. ఎన్టీఆర్ తో చేసే సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందించేందుకు ప్ర‌శాంత్ నీల్ ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఇందులో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడ‌ట‌. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే పేరు బాగా వినిపించింది. దీపికి దాదాపుగా క‌న్ ఫ‌ర్మ్ అంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌రో హీరోయిన్ పేరు వినిపిస్తోంది.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. అతిలోక‌సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీక‌పూర్. ఎప్ప‌టి నుంచో జాన్వీని టాలీవుడ్ కి ప‌రిచయం చేయాల‌ని టాప్ ప్రొడ్యూస‌ర్స్ అండ్ డైరెక్ట‌ర్స్ ట్రై చేస్తున్నారు కానీ.. జాన్వీ నో చెబుతూ వ‌చ్చింది. ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు జాన్వీ ఓకే చెప్పింద‌న టాక్ వినిపిస్తోంది. ఇలా దీపికా, జాన్వీ పేర్లు తెర పైకి రావ‌డంతో ఈ మూవీలో హీరోయిన్ ఎవ‌రు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Readఎన్టీఆర్ తో త‌మిళ డైరెక్ట‌ర్ భారీ చిత్రం నిజ‌మేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్