Friday, March 13, 2026
Homeసినిమాఎన్టీఆర్ జోడీ కడుతున్న రష్మిక? 

ఎన్టీఆర్ జోడీ కడుతున్న రష్మిక? 

Rashmika with Young Tiger: కథానాయికగా అవకాశాలను అందిపుచ్చుకోవడానికీ, చకచకా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడానికి అందం .. అభినయం మాత్రమే ఉంటే సరిపోవు .. కాస్త లౌక్యం కూడా కావలసిందే. లేదంటే పరిగెత్తుకుంటూ వచ్చిన అవకాశాలు పాదరసంలా జారిపోతాయి. అదే కాస్త లౌక్యం తెలిసి ఉంటే జారిపోయే అవకాశాలు కూడా వచ్చి ఒళ్లో వాలిపోతాయి. అలాంటి లౌక్యం తెలిసిన కథానాయికలలో రష్మిక ముందు వరుసలో కనిపిస్తుంది. తెరపైనే కాదు .. బయట కూడా రష్మికకు చురుకుదనం .. చలాకీదనం ఎక్కువే.

రష్మిక అందగత్తె మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు కూడా. తెలుగులో ‘ఛలో’ సినిమాతో హిట్ కొట్టేసిన ఆమె, ఆ తరువాత ‘గీత గోవిందం‘తో స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంటర్ కావడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. మధ్యలో రెండు సినిమాలు ఓ మాదిరిగా అనిపించినా, ఆ వెంటనే వచ్చిన ‘భీష్మ’ .. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో పుంజుకుంది. ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ ఏడాదికి సరిపోయే విజయాన్ని తన హ్యాండ్ బ్యాగులో వేసుకుంది. ఇకపై మరింత దూకుడు పెంచడానికి ఆమె రెడీ అవుతోంది.

యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ పేరు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి తెరపైకి వచ్చిది. కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో కథానాయికగా పలువురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక పేరు తెరపైకి వచ్చింది. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. ప్రస్తుతం ఆమె శర్వానంద్ సరసన నాయికగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చేస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular