Friday, March 6, 2026
Homeసినిమా‘పుష్ప‌’లో స‌మంత‌ ఐటం సాంగ్?

‘పుష్ప‌’లో స‌మంత‌ ఐటం సాంగ్?

 Samantha Item Song In Pushpa :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. సుకుమార్ సినిమా అంటే.. ఐటం సాంగ్ ఖ‌చ్చితంగా ఉంటుంది. సుకుమార్ తెర‌కెక్కించిన‌ ‘ఆర్య’ నుంచి ‘రంగ‌స్థ‌లం’ వ‌ర‌కు ఐటం సాంగ్స్ ను స్పెష‌ల్ గా డిజైన్ చేయ‌డం.. ఆ సాంగ్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం తెలిసిందే.

ఇక ‘పుష్ప’ లో కూడా ఐటం సాంగ్ ను స్పెష‌ల్ గా డిజైన్ చేశారు. ఈ ఐటం సాంగ్ ను ముందుగా బాలీవుడ్ హీరోయిన్ తో ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ మ‌ధ్య క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే పేరు గ‌ట్టిగా వినిపించింది. ఆత‌ర్వాత మిల్కీబ్యూటీ త‌మ‌న్నా పేరు వినిపించింది. ఇప్పుడు వీరిద్ద‌రూ కాకుండా స‌మంత పేరు తెర పైకి వ‌చ్చింది. ఇది నిజంగా షాకింగే. సుకుమార్.. సమంత‌తో ఐటం సాంగ్ చేయించాల‌నుకోవ‌డం.. దీనికి స‌మంత కూడా ఓకే అన‌డం జ‌రిగింద‌ని టాక్ వినిపిస్తుంది.

Also Read :  ‘పుష్ప’ నుంచి మ‌రో సాంగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular