Monday, June 15, 2026
Homeసినిమాఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న ‘డియర్ మేఘ’

ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న ‘డియర్ మేఘ’

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం ‘డియర్ మేఘ’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఏషియన్ సినిమాస్ ద్వారా నైజాంలో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ మూవీ పోస్టర్స్ అండ్ టీజర్ కు మంచి స్పందన లభించింది. దీంతో ‘డియర్ మేఘ’ టీమ్ అంతా ఈ సినిమా విజయం పై గట్టి నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్,పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. మేఘా ఆకాష్,అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు, పవిత్రా లోకేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – కె.వి రమణ , పీఆర్వో – జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన, దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular