Monday, May 20, 2024
Homeసినిమానాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు సినిమా ప్రీలుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు సినిమా ప్రీలుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

కింగ్ నాగార్జున‌, డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ సత్తారు కాంబినేష‌న్‌లో హైరేంజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంక‌టేశ్వ‌ర ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నారాయ‌ణ్ దాస్ కె.నారంగ్‌, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు, శ‌ర‌త్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని అందించ‌బోయే చిత్రంగా భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున ప‌వ‌ర్‌పుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. శుక్ర‌వారం నిర్మాత సునీల్ నారంగ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఇందులో నాగార్జున యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్‌లో క‌త్తి చేత ప‌ట్టుకుని క‌నిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా నుంచి కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు (ఆగ‌స్ట్ 29)న ఎగ్జ‌యిటింగ్ అప్‌డేట్ రానుంది. నిర్మాత‌లు హై బ‌డ్జెట్‌లో దీన్ని  నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో గుల్ ప‌నాంగ్‌, అనైక సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ముకేష్ జి సినిమాటోగ్రాఫ‌ర్‌గా, బ్ర‌హ్మ క‌డలి ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా, రాబిన్ సుబ్బు, న‌భా వంటి స్టంట్స్ మాస్ట‌ర్స్‌గా.. టాప్ టెక్నీషియ‌న్స్ ఈ చిత్రం కోసం ప‌నిచేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్