Tuesday, March 25, 2025
HomeTrending Newsపాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్తాన్ లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్ నుంచి రాజన్ పుర్ వెళుతున్న బస్సు డేరా ఘాజి ఖాన్ దగ్గర ప్రమాదానికి గురయ్యింది. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సు ఇండస్ రహదారి మీద మితిమీరిన వేగంతో వెళ్ళటం వల్లే దుర్ఘటన జరిగిందని ప్రాథమిక సమాచారం. తీవ్రగా గాయపడ్డ వారిని డేరా ఘాజిఖాన్ నగరంలోని ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో  మహిళలు, పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్